NEET UG 2021 ఫేజ్ 2 నమోదుకు ఈ రోజే ఆఖరు తేదీ.. ఫలితాలు కూడా ఈ నెలలోనే..!
NEET UG 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు NEET UG ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ విండోను మూసివేస్తుంది. ఫేజ్ 2 పరీక్ష కోసం నమోదు చేసుకోని
NEET UG 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు NEET UG ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ విండోను మూసివేస్తుంది. ఫేజ్ 2 పరీక్ష కోసం నమోదు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లో తప్పులు జరిగితే సవరణ కూడా చేసుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం.. అభ్యర్థులు లింగం, జాతీయత, ఈ-మెయిల్ చిరునామా, వర్గం, ఉప-వర్గం మొదలైనవాటిని సరిచేసుకోవచ్చు.
నీట్ 2021 ఫేజ్ 2 కోసం ఎలా నమోదు చేసుకోవాలి 1. ముందుగా CTET అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inకి వెళ్లండి. 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు పేరు, ఈ మెయిల్, మొబైల్ నంబర్, అభ్యర్థించిన ఇతర సమాచారాన్ని సమర్పించాలి. 4. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని ఇవ్వాలి. 5. ఫోటోను అప్‌లోడ్ చేసి సంతకం చేయాలి. 6. దరఖాస్తు రుసుమును చెల్లించాలి. 7. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, చివరకు నిర్ధారణ పేజీ నుంచి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
NEET 2021 దరఖాస్తు ఫారమ్‌లో దిద్దుబాట్లు 1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inని సందర్శించండి. 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన కరెక్షన్ విండో లింక్‌పై క్లిక్ చేయండి. 3. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో లాగిన్ కావాలి. 4. సవరించాలనుకుంటున్న సమాచారాన్ని సవరించాలి. 5. దరఖాస్తు ఫారమ్‌ను మళ్లీ సమర్పిస్తే సరిపోతుంది.
ఈ నెలలోనే నీట్ ఫలితాలు నీట్ విద్యార్థులు ఇప్పటికే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా నీట్ ఫలితాలు వెలువడవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో విడుదల చేస్తుంది. అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్ నుంచి మాత్రమే చూసుకోగలరు. నీట్ యూజీ పరీక్ష సెప్టెంబర్ 12న జరిగిన విషయం తెలిసిందే.