CTET Exam 2021: ఫీజు చెల్లించడానికి చివరితేదీ ఈ రోజే.. డిసెంబర్‌ 16 నుంచి పరీక్షలు

CTET Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం దరఖాస్తు ఫీజు చెల్లించడానికి

CTET Exam 2021: ఫీజు చెల్లించడానికి చివరితేదీ ఈ రోజే.. డిసెంబర్‌ 16 నుంచి పరీక్షలు
Ctet Exam
Follow us
uppula Raju

|

Updated on: Oct 26, 2021 | 9:25 AM

CTET Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జారీ చేసిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈ రోజే చివరి తేదీ. అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- ctet.nic.in ని సందర్శించి ఫీజులను చెల్లించాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 25గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలని కలలు కనే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 20 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 అక్టోబర్ 2021 నుంచి అక్టోబర్ 25కి మార్చారు.

పరీక్ష వివరాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) తేదీలను విడుదల చేసింది. CTET 15వ ఎడిషన్ CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మోడ్‌లో జరుగుతుంది. 16 డిసెంబర్ 2021 నుంచి 13 జనవరి 2022 వరకు నిర్వహిస్తారు.

20 భాషల్లో పరీక్ష జరుగుతుంది ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మణిపురి, మరాఠీ, మిజో, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, టిబెటన్, ఉర్దూతో సహా 20 భాషలలో పరీక్ష నిర్వహిస్తున్నారు.

దరఖాస్తు రుసుము ఇందులో ఒక పేపర్‌కు దరఖాస్తు చేయడానికి జనరల్ / OBC అభ్యర్థులు 1000 రూపాయలు, రెండు పేపర్‌లకు 1200 రూపాయలు చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము ఒక పేపర్‌కు రూ. 500 రెండు పేపర్‌లకు రూ. 600గా నిర్ణయించారు.

దరఖాస్తు ఫారమ్‌లో దిద్దుబాటు CTET అప్లికేషన్ 2021లో దిద్దుబాట్లు చేయడానికి ఆన్‌లైన్ విండో ctet.nic.inలో ఓపెన్ అవుతుంది.అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో 28 అక్టోబర్ 2021 వరకు దిద్దుబాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి అవకాశం ఇవ్వబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

Bangladesh Riots: ఫేస్‌బుక్‌లో పాప్యులర్ కావాలని అతను చేసిన పని మతాల మధ్య చిచ్చుపెట్టింది!

Black Pepper Tea: నల్ల మిరియాల టీ ఆ రోగులకు దివ్య ఔషధం..! ఖర్చు కూడా తక్కువే..

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. అటెండర్‌తో సహా అన్ని పోస్టులు..

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!