NEET PG Counselling 2021: NEET PG కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఇలా నమోదు చేసుకోండి..
NEET PG Counselling 2021: NEET PG కౌన్సెలింగ్ 2021 షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది.
NEET PG Counselling 2021: NEET PG కౌన్సెలింగ్ 2021 షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. MCC తన వెబ్‌సైట్ mcc.nic.inలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కౌన్సెలింగ్ 24 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమవుతుంది. దీని ద్వారా దేశంలోని డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, AFMS లో MD, MS, డిప్లొమా, PG DNB కోర్సులలో ప్రవేశం ఉంటుంది.
25 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు కౌన్సెలింగ్ కోసం నమోదు ప్రారంభమవుతుంది. మీరు NEET PG లేదా MCC వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. మొదటి రౌండ్ కోసం ఎంపిక ఫిల్లింగ్, లాకింగ్ కోసం అక్టోబర్ 26 నుంచి 29 వరకు సమయం ఉంటుంది. అలాగే 1 నవంబర్ నుంచి 20 నవంబర్ వరకు మొదటి రౌండ్ కోసం సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు కేటాయింపు ఫలితాలు నవంబర్ 3న విడుదల చేస్తారు. నవంబర్ 4 నుంచి10 వరకు మొదటి రౌండ్ కోసం సీటును అంగీకరించిన తర్వాత రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది.
దీని తరువాత NEET PG కౌన్సెలింగ్ రెండో రౌండ్ డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తారు. ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు రాష్ట్ర కోటాలో కేటాయిస్తారు. రెండో రౌండ్ తరువాత మోప్-అప్ రౌండ్ ఉంటుంది. ఇది డిసెంబర్ 7 నుంచి 26 వరకు నడుస్తుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నవంబర్15 లోపు కొత్త LoP లు, అక్రిడిటేషన్‌లు జారీ చేస్తాయని తెలిపింది. అందువల్ల రౌండ్ 1 లో లేని కొత్త సీట్లను రౌండ్ 2 లో చేర్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.