NEET PG 2025 Exam Date: నీట్‌ పీజీ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీ ఇదే

మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్‌ పీజీ పరీక్ష 2025 తేదీని NBE విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పీజీ సీట్లు కేటాయిస్తారు. అయితే ఇందుకు ముందుగా ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసి ఉండాలి..

NEET PG 2025 Exam Date: నీట్‌ పీజీ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీ ఇదే
NEET PG 2025 Exam Date
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2024 | 3:33 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్‌ పీజీ పరీక్ష 2025 తేదీని నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌ 15వ తేదీన నీట్‌ పీజీ 2025 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఆ పరీక్షకు హాజరుకావాలనుకునే వారు వచ్చే ఏడాది జులై 31వ తేదీ నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్‌బీఈ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 52 వేల పీజీ సీట్లు ఉన్నాయి. వీటి కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు పోటీపడుతున్నారు. మరోవైపు మెడికల్‌ విద్యా సంస్థల్లో జడలు విప్పుకొన్ని విలయతాండవం చేస్తున్న ర్యాగింగ్‌ భూతాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, 2021లో జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని దేశంలోని అన్ని వైద్య కళాశాలలను నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆదేశించింది.

డిసెంబర్‌ 14న సీటెట్‌ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్‌ 2024 పరీక్ష డిసెంబర్‌ 14వ తేదీన (శనివారం) జరగనుంది. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి సీబీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీట్‌ పరీక్షను ఓఎమ్మార్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు.

కాగా సీటెట్ పరీక్ష ప్రతి యేట రెండుసార్లు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహిస్తారు. రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్‌ఖు లైఫ్​లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో యేటా వేలాది మంది సీటెట్ పరీక్షకు హాజరవుతుంటారు.

ఇవి కూడా చదవండి

సీటెట్ 2024 పరీక్ష అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.