NCRTC Jobs: యూజీ/పీజీ అర్హతతో ఎన్సీఆర్టీసీలో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NCRTC) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

NCRTC Jobs: యూజీ/పీజీ అర్హతతో ఎన్సీఆర్టీసీలో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి!
Ncrtc New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2022 | 6:37 AM

NCRTC New Delhi Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NCRTC) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 7

ఖాళీల వివరాలు: మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌పర్ట్ ఫీడర్ తదితర పోస్టులు

విభాగాలు: ట్రాన్ప్‌పోర్ట్ ప్లానింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ వంటి ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.30,000ల నుంచి రూ.2,20,000లు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ/మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో రెండు నుంచి 12 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ప్రకటన వెలువడిన రోజు నుంచి 7 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CPRI Bengaluru Jobs: బీటెక్ అర్హతతో నెలకు లక్షకు పైగా జీతంతో ఉద్యోగావకాశాలు.. అకడమిక్ మెరిట్‌తో ఎంపికలు..!