CPRI Bengaluru Jobs: బీటెక్ అర్హతతో నెలకు లక్షకు పైగా జీతంతో ఉద్యోగావకాశాలు.. అకడమిక్ మెరిట్‌తో ఎంపికలు..!
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI Bengaluru)ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1 (Engineering Officer Posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
CPRI Bengaluru Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI Bengaluru)ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1 (Engineering Officer Posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు: పోస్టులు: ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1
మొత్తం పోస్టుల సంఖ్య: 14
ఖాళీల వివరాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 8 మెకానికల్ ఇంజనీరింగ్: 2 కెమికల్ ఇంజనీరింగ్: 2 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 2
వయోపరిమితి: ఫిబ్రవరి 21, 2022నాటికి 30 ఏళ్లు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.44,900ల నుంచి రూ.1,42,400లు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 2020/2021 వాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 31, 2022.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: