NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నరకు పైగా జీతం పొందే అవకాశం..
NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను..
NHAI Recruitment: నేషనల్ హైవేష్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకిగాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మొత్తం 17 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ ఇన్ కామర్స్/ సీఏ/ సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినేషన్ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* పరీక్ష పార్ట్ 1, పార్ట్ 2 లో భాగంగా 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
* జనరల్ అభ్యర్థ/లు రూ. 500, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థ/లు రూ. 300 ఫీజుగా చెల్లించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: MLA Roja: తగ్గేదెలే.. విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియోలు వైరల్..
Kuppam: పట్టపగలు.. పోలీస్ స్టేషన్ ముందు.. నడిరోడ్డుపై సిట్టింగ్ వేసిన మందుబాబు..