Railway Job 2021: నిరుద్యోగులకు గమనిక..! రైల్వేలో 16000 పోస్టులకు నోటిఫికేషన్‌.. వెంటనే అప్లై చేయండి..

Railway Job 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా వివిధ జోన్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.16000కు పైగా అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ

Railway Job 2021: నిరుద్యోగులకు గమనిక..! రైల్వేలో 16000 పోస్టులకు నోటిఫికేషన్‌.. వెంటనే అప్లై చేయండి..
Railway Job
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 4:44 PM

Railway Job 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా వివిధ జోన్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.16000కు పైగా అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు చివరి తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే వివిధ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే, పశ్చిమ మధ్య రైల్వేతో సహా వివిధ జోన్లలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే ద్వారా అప్రెంటీస్‌ల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4103 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మరిచిపోవద్దు.

తూర్పు రైల్వే రిక్రూట్‌మెంట్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తూర్పు రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి కొనసాగుతోంది. అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ www.rrcer.com ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3366 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ అదేవిధంగా పశ్చిమ మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 11 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in ద్వారా 10 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2226 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇతర నియామకాలు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్‌రాజ్ అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1664 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

అర్హత రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) జారీ చేసిన నోటీసు ప్రకారం.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10, 12వ ఉత్తీర్ణత కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే అభ్యర్థి సంబంధిత స్ట్రీమ్‌లో ITI డిగ్రీని కలిగి ఉండాలి.

Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Naga Shaurya Father Case: నాగ శౌర్య ఫార్మ్‌హౌస్ పేకాట కేసు.. FIR కాపీ.. వివరాల్లోకి వెళ్తే..

RRR Movie Glimpse: మరో రేంజ్‌లో ట్రిపులార్.. జక్కన్న మూవీపై బిజినెస్ అంచనాలను మరింతగా పెంచేసిన గ్లింప్స్

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో