MLA Roja: తగ్గేదెలే.. విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియోలు వైరల్..
రాజకీయాలు, టీవీ షోలతో బిజీబిజీగా గడిపే నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయారు.
రాజకీయాలు, టీవీ షోలతో బిజీబిజీగా గడిపే నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు కబడ్డీ ప్లేయర్‌గా మారిపోయారు. తన భర్త సెల్వమణితో కలిసి ‘కబడ్డీ కబడ్డీ ‘ అంటూ కబడ్డీ కోర్టు బరిలోకి అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజా పుట్టిన రోజు(నవంబర్17)ను పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏటా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు.
భార్యాభర్తలు..ప్రత్యర్థులుగా విడిపోయి..
నేటి నుంచి ఈనెల 15 వరకు కొనసాగే ఈ ‘స్టోర్ట్స్ మీట్’ను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ విద్యార్థులతో కాసేపు కబడ్డీ ఆడారు. వేర్వేరు గ్రూపులుగా విడిపోయి కబడ్డీ కబడ్డీ అంటూ తలపడ్డారు. ఈ నేపథ్యంలో ‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ కూతపెడుతూ బరిలోకి దిగిన రోజా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడిన వీడియోను మీరూ చూసేయండి మరి..
AlsoRead: