AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!

Miyapur Husband Murder Case: దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో భార్యామణులు భర్తలను హతమార్చుతున్న కథనాలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే మనదేశంలో రోజుకో ప్రాంతంలో భర్తను దారుణ హత్యలకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిరాతక ఉదంతం వెలుగుచూసింది..

మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!
Miyapur Husband Murder Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 5:21 PM

Share

హైదరాబాద్‌, జులై 7: పరాయి వ్యక్తితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ ఇల్లాలు.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని మాయం చేసింది. ఆనక ఏమీ నటిస్తూ భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు కిలాడీ లేడీ.. ఫిర్యాదుపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక దర్యాప్తులో పోలీసులకు తాజాగా అసలు గుట్టు తెలిసొచ్చింది.

ఈ కేసు లోతైన దర్యాప్తులో భాగంగా పోలీసులు సదరు మహిళ కాల్ డేటా రికార్డులను (CDR), ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. అనంతరం ఆధారాలు దొరక్కుండా శవాన్ని వాహనంలో మహారాష్ట్ర సరిహద్దుల (బార్డర్) వరకు తరలించి.. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ మేరకు నిర్ధారించారు. దీంతో నిందితులైన సదరు కిలాడి లేడీ, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులు తెలిపిన ఆధారాల మేరకు మహారాష్ట్రలోని స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు.

ఇవి కూడా చదవండి

కాగా నేటి సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు ప్రశ్నార్ధకంగా మారాయి. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన పలు ఘటనలు ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థను దిగజార్చుతున్నాయి. కొన్ని చోట్ల భర్తలే కట్టుకున్న భార్యలను అడ్డుతొలగిస్తుంటే.. మరికొన్ని చోట్ల పరాయి పరుషుల వ్యామోహంలో భార్యలు తమ భర్తలను అంతమొందిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో పెళ్లి అంటేనే యువతీ, యువకులు జడుసుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో జంటలు తమ జీవిత భాగస్వాములను చంపడానికి సుపారీలు ఇచ్చి మరీ హత్యలు చేయిస్తున్నారు. హత్యలకు రకరకాల ప్లాన్‌లు వేసి.. ఆనక పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు.

Follow Us
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి
పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి