AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

వయసు పైబడే కొద్దీ జ్ఞాపకశక్తిని తుడిచిపెట్టే అల్జీమర్స్ వ్యాధికి త్వరలోనే ఒక పరిష్కారం దొరకబోతుందా? వంద ఏళ్లుగా టీబీ నివారణకు వాడుతున్న బీసీజీ వ్యాక్సిన్.. ఇప్పుడు మెదడులో నిద్రాణంగా ఉన్న రోగనిరోధక కణాలను మళ్లీ యాక్టివేట్ చేయగలదని అంతర్జాతీయ పరిశోధకులు గుర్తించారు. ప్రసిద్ధ నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
Bcg Vaccine For Alzheimers
Krishna S
|

Updated on: Jul 28, 2026 | 12:19 PM

Share

వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో వచ్చే మార్పులు, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి వైద్య శాస్త్రంలో ఒక కీలక ముందడుగు పడింది. క్షయ నివారణకు వాడే బీసీజీ వ్యాక్సిన్ మెదడులోని రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి, అల్జీమర్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేయగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ న్యూరాలజీ  సీనియర్ రీసెర్చ్ ఫెలో, మన తెలుగు న్యూరోసైంటిస్ట్ మహేష్ చంద్ర కొడాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తుంది.

అధ్యయనం వెనుక అసలు విషయమేంటి?

వయసు పైబడే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మెదడులో దీర్ఘకాలిక మంట ఏర్పడటం వల్ల అల్జీమర్స్ వంటి రుగ్మతలు వస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తిని ట్రైన్ చేసి భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్లు, వ్యాధులను తట్టుకునేలా చేయడంలో బీసీజీ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని గతంలోనే తేలింది. తాజాగా మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులపై ఒక సంవత్సరం పాటు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అల్జీమర్స్ లక్షణాలు లేనివారు, ఆ వ్యాధి ముందస్తు మార్పులు ఉన్నవారికి ఒక నెల వ్యవధిలో రెండుసార్లు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు.

మెదడులోనూ కనిపించిన మార్పులు..

ఈ పరిశోధనలో భాగంగా సేకరించిన రక్తం, వెన్నుపూస ద్రవం నమూనాలను పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మెదడును రక్షించే ద్రవంలోని రోగనిరోధక కణాలు ఉత్తేజితమైనట్లు తేలింది. శరీరంలోని ఇతర భాగాలతో సంబంధం లేకుండా మెదడులోని కణాలు ప్రత్యేకంగా స్పందించి, జీవక్రియలను మెరుగుపరిచే సంకేతాలను చూపించాయి. ముఖ్యంగా అల్జీమర్స్ లక్షణాలు లేని వ్యక్తులలో మెదడు ద్రవంలో హానికరమైన అమిలాయిడ్ బీటా ప్రొటీన్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

భవిష్యత్ చికిత్సకు సంకేతం.. కానీ మరిన్ని పరిశోధనలు అవసరం

ఈ అధ్యయనం ద్వారా బీసీజీ వ్యాక్సిన్ మెదడులో ఇన్ఫ్లమేషన్ పెంచకుండా, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకురాగలదని స్పష్టమైంది. అయితే ఇది కేవలం ప్రాథమిక పరిశోధన మాత్రమేనని, అల్జీమర్స్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని నిర్ధారించడానికి మరింత విస్తృతమైన, ప్లేసిబో-నియంత్రిత క్లినికల్ ట్రయల్స్ అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైతేనేమి.. ఎంతో కాలంగా వైద్య రంగాన్ని వేధిస్తున్న అల్జీమర్స్ మహమ్మారికి వ్యతిరేకంగా.. అందరికీ అందుబాటులో ఉన్న ఒక సాధారణ వ్యాక్సిన్‌తో రక్షణ కల్పించే మార్గంపై ఈ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Follow Us
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు..
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. సోలార్ పంపుకు 90% సబ్సిడీ!
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
హైదరాబాద్ ప్రయాణికుడి కేసు.. రైల్వే తిక్క కుదిర్చిన కోర్టు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి
పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి