విదుర నీతి : జీవితంలో ఒంటరిగా చేయకూడని పనులు ఇవే

Samatha

28 July 2026

విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాభారతంలో ఈయనది చాల కీలక పాత్ర.

ఈయన కౌరవులకు, పాండవులకు సూచనలు ఇస్తూ, జీవితంలో ధర్మ బద్ధంగా ఎలా నడుచుకోవాలో ఆయన తెలియజేశారు.

అదే విధంగా విదురుడు, ఒక వ్యక్తి తన జీవితంలో అస్సలే కొన్ని పనులు చేయకూడదు అని హెచ్చరించడం జరిగింది. అవి ఏవో చూసేద్దాం.

విదుర నీతి ప్రకారం, ఒక వ్యక్తి అస్సలే  ఒంటరిగా భోజనం చేయకూడదంట. ఇది మంచి ఫలితాలను ఇవ్వదంట.

అలాగే కొంత మంది ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకూడదు అని చెబుతున్నాడు విదురుడు.

అదే విధంగా కొందరు ఎప్పుడూ ఒంటరిగా మేల్కొని ఉంటారు. ఇలా ఒంటరిగా మేల్కొని ఉండటం కూడా మంచిది కాదంట.

విదుర నీతి ప్రకారం, నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదంట. దీని వలన మీపై ఎవరైనా దాడి చేసే ఛాన్స్ ఉంటుందంట.

నోట్ : పై సమాచారం,కేలం ఇంటర్నెట్, పండితుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.