AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Deadline: మెగా డీఎస్సీ గడువు పొడిగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే?

గత నెల 20వ తేదీన మెగా డీఎస్సీకి కూటమి సర్కార్ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు ఏడేళ్ల పోరాడం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో తొలిసారి డీఎస్సీ నియామకాలు జరుగుతున్నాయని.. కనీసం నిరుద్యోగుల విన్నపాలను సర్కార్‌ ఏమాత్రం..

AP Mega DSC 2025 Deadline: మెగా డీఎస్సీ గడువు పొడిగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే?
Minister Lokesh comments on Mega DSC
Srilakshmi C
|

Updated on: May 16, 2025 | 9:08 AM

Share

అమరావతి, మే 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మెగా డీఎస్సీ చర్చ నీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏకంగా 16,347 ఉపాధ్యాయ కొలువుల జారీకి సంతకం చేసింది. అయితే ఆ తర్వాత తెరమీదకు వచ్చిన ఎస్సీ వర్గీకరణ కారణంగా వాయిదా పడగా.. గత నెల 20వ తేదీన డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే దాదాపు ఏడేళ్ల పోరాడం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో తొలిసారి డీఎస్సీ నియామకాలు జరుగుతున్నాయని.. కనీసం నిరుద్యోగుల విన్నపాలను సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

దరఖాస్తు గడువు పొడిగించాలని, ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని వస్తున్న అభ్యర్ధనలను కూటమి సర్కార్‌ పెడచెవిన పెడుతుంది. నిజానికి, మెగా డీఎస్సీ ప్రకటన చేసినప్పటి నుంచి నిరుద్యోగుల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలో 90 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం కావాలని వస్తున్న అభ్యర్ధనలపై మంత్రి లోకేష్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

మెగా డీఎస్సీని ఆపడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొంత మంది ప్రిపరేషన్‌కు సమయం పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే సిలబస్‌ను డిసెంబర్ నెలలోనే ఇచ్చేసామని, అప్పటి నుంచి చూస్తే దాదాపు ఇప్పటి వరకు గడువు ఏడు నెలలు పూర్తయిందని అన్నారు. దీనిని బట్టి చూస్తే ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు లేనట్లేనని స్పష్టమైంది. అలాగే జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు యథాతథంగా జరగబోతున్నట్లు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు తేల్చేశాయి. దీంతో గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. ఉన్న సమయంలోనే సిలబస్‌ ఎలా పూర్తి చేయాలో తెలియక ఒత్తిడికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా గురువారం అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్.. గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో డీఎస్సీ 2025పై మంత్రి లోకేష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.