AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 6 నెల్లపాటు సినిమాలు తక్కువగా చూడమంటున్న మంత్రి కేటీఆర్‌! ఎందుకో తెలుసా..

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లారెడ్డి కోచింగ్‌ సెంటర్‌ను నేడు (మార్చి 14) మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు..

Hyderabad: 6 నెల్లపాటు సినిమాలు తక్కువగా చూడమంటున్న మంత్రి కేటీఆర్‌! ఎందుకో తెలుసా..
Ktr
Srilakshmi C
|

Updated on: Mar 14, 2022 | 7:17 PM

Share

KTR inaugurated a free coaching centre in Peerzadiguda Municipal Corporation: ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన తరువాత తొలి ఉచిత కోచింగ్ సెంటర్ (mallareddy free coaching centre ) ఏర్పాటు చేసిన ఘనత మంత్రి మల్లారెడ్డిదేనని కేటీఆర్‌ (KTR) అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్లారెడ్డి కోచింగ్‌ సెంటర్‌ను నేడు (మార్చి 14) మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు చేతుల మీదుగా ప్రారంభిన అనంతరం ఈ విధంగా ప్రసంగించారు.. తెలంగాణలో త్వరలో భర్తీ చేయనున్న వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు టి శాట్ (T-Sat) ద్వారా కూడా శిక్షణ తరగతలు స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచామన్నారు. ‘టి-శాట్’ సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కష్టపడి ప్రిపేరయినా ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందవద్దని, ప్రయివేటు పరంగా కూడా కంపెనీలను తీసుకొచ్చి వేల ఉద్యోగాలు మన యువతకు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత విభాగాల్లో కూడా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాళ్లు కూడా వాటిని ఎప్పటికైనా నింపక తప్పదు. అందులో కూడా యువత పోటీ పడేలా సిద్ధమవ్వాలన్నారు. యువతకు స్కిల్స్ పెంచేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దీని సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఒక ఆరు నెలలు యువత సినిమాలు తక్కువ చూస్తే బంగారు భవిత ముందుంటుందన్నారు. సోషల్ మీడియా, ఫోన్ కూడా కొంచెం తక్కువ వాడితే మంచిదని, ఉద్యోగాలకు బాగా ప్రిపేర్ అవ్వాలని విద్యార్ధులకు ఈ సంర్భంగా కేటీఆర్‌ సూచించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ప్రకటన నేపథ్యంలో ఏర్పాటైన ఈ కోచింగ్‌ సెంటర్‌లో అభ్యర్థులకు మూడు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా ఆహారం, స్నాక్స్ అందజేస్తుంది.

Also Read:

EdCIL Limited Jobs: బీటెక్‌/ఎంబీఏ అర్హతతో..ఎడ్యుకేషనల్‌ ఎన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు!