AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2023 Counselling Schedule: ఎంబీబీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. నాలుగు విడతల్లో కౌన్సెలింగ్

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఎమ్‌సీసీ షెడ్యూలు విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం జులై 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది..

NEET UG 2023 Counselling Schedule: ఎంబీబీఎస్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. నాలుగు విడతల్లో కౌన్సెలింగ్
NEET UG 2023 Counselling
Srilakshmi C
|

Updated on: Jul 17, 2023 | 12:32 PM

Share

న్యూఢిల్లీ, జులై 17: దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఎమ్‌సీసీ షెడ్యూలు విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం జులై 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. నీట్ యూజీ-2023లో ర్యాంక్‌ పొందిన విద్యార్ధులకు ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. కౌన్సెలింగ్‌ నాలుగు విడతలుగా జరుగుతుంది. మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు.

ఎంబీబీఎస్ అడ్మిషన్ల షెడ్యూల్‌ 2023 ఇదే..

  • తొలి విడత జులై 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 20 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు చేసుకోవాలి. తొలి విడత ఫలితాలను 29న విడుదలవుతాయి.
  • రెండో విడత ఆగస్ట్ 16, 17 తేదీల్లో ఉంటుంది.రిజిస్ట్రేషన్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 మధ్య చేసుకోవల్సి ఉంటుంది. రెండో విడత ఫలితాలు ఆగస్టు 18న ప్రకటిస్తారు.
  • మూడో విడత సెప్టెంబర్ 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 వరకు ఉంటుంది. మూడో విడత ఫలితాలు సెప్టెంబరు 8న వెల్లడవుతాయి.
  • మిగిలిన సీట్లను చివరి విడతలో భర్తీ చేస్తారు. నాలుగో విడత విడత రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు ఉంటుంది. ఫలితాలను సెప్టెంబర్‌ 26న ప్రకటిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.