UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూబీఐ హ్యూమన్ రీసోర్స్ విభాగంలో..
UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూబీఐ హ్యూమన్ రీసోర్స్ విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ మేనేజర్ (09), మేనేజర్ (16) ఖాళీలు ఉన్నాయి.
* డిజిటల్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఎకనమిస్ట్, ఇండస్ట్రీ రిసెర్చ్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/ బీటెక్ /ఎంటెక్/ ఎంసీఏ, ఎంఏ, పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 07-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Pakistan: చైనాను అనుసరించే ప్రయత్నం.. భారత సైనికుల హెచ్చరికతో వెనక్కి.. ఇది పాక్ తాజా నిర్వాకం!
Cricket: 16 సిక్సర్లు, 571 పరుగులు.. 4 అర్ధ సెంచరీలు.. మ్యాచ్ చివర్లో అదిరిపోయే ట్విస్ట్.!
Home Guards Salaries: హోంగార్డులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 30 శాతం జీతాలు పెంపు!