Cricket: 16 సిక్సర్లు, 571 పరుగులు.. 4 అర్ధ సెంచరీలు.. మ్యాచ్‌ చివర్లో అదిరిపోయే ట్విస్ట్.!

సాధారణంగా వన్డేలు, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ల విధ్వంసం సర్వసాధారణం. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. డొమెస్టిక్ మ్యాచ్‌లు...

Cricket: 16 సిక్సర్లు, 571 పరుగులు.. 4 అర్ధ సెంచరీలు.. మ్యాచ్‌ చివర్లో అదిరిపోయే ట్విస్ట్.!
Cricket 1
Follow us

|

Updated on: Dec 21, 2021 | 6:25 PM

సాధారణంగా వన్డేలు, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ల విధ్వంసం సర్వసాధారణం. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. డొమెస్టిక్ మ్యాచ్‌లు వేరే ఎత్తు అని చెప్పాలి. ఇక్కడ న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ఇరు జట్లలోనూ కలిపి నలుగురు బ్యాట్స్‌మెన్లు చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించారు. వెరిసి మొత్తం మ్యాచ్‌లో 571 పరుగులు.. 16 సిక్సర్లు.. 4 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. ఇక ఇందులో ఓ 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. కేవలం 11 బంతుల్లోనే బౌండరీల రూపంలో 52 పరుగులు చేశాడు. ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా వెల్లింగ్టన్, ఒటాగో జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 4 ఏళ్ల ట్రాయ్ జాన్సన్ విధ్వంసం సృష్టించాడు. ఇందులో ఒటాగో 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 333 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 24 ఏళ్ల ట్రాయ్ జాన్సన్ బౌలర్ల భరతం పట్టాడు. రచిన్ రవీంద్ర(46)తో కలిసి రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జాన్సన్(88) అద్భుత అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అటు మరో బ్యాట్స్‌మెన్ టామ్ బ్లండిల్(53) హాఫ్ సెంచరీ సాధించాడు.

111 నిమిషాల్లో కేవలం 11 బంతుల్లో 52 పరుగులు..!

ఈ మ్యాచ్‌లో ట్రాయ్ జాన్సన్ 111 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతడు 78 బంతులు ఎదుర్కుని 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. ఇందులో అతడు బౌండరీల రూపంలో 11 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్‌ జాన్సన్‌కు ఇది ఐదో అర్ధ సెంచరీ.. అతడు 12 మ్యాచ్‌ల్లో 531 లిస్ట్‌-ఏ పరుగులు చేశాడు.

భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో చివర్లో ట్విస్ట్..

334 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒటాగో జట్టు కేవలం 238 పరుగులకే ఆలౌటైంది. కీలక బ్యాట్స్‌మెన్లు ఉన్న ఈ జట్టు విజయాన్ని అందుకుంటుందని అందరూ ఊహించారు. కానీ మొత్తం బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం నిక్ కెల్లీ(67), మైఖేల్ రిప్పన్(68) మాత్రమే కాసింత ఫర్వాలేదనిపించారు. వెల్లింగ్టన్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ 3 వికెట్లు పడగొట్టగా.. న్యూటన్, బెన్నెట్ రెండేసి వికెట్లు.. వాన్ బీక్, స్మిత్‌లు చెరో వికెట్ తీశారు. దీనితో ఒటాగో జట్టు 95 పరుగులతో ఓటమిని చవి చూసింది.

ఇది చదవండి:

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఈజీగా గుర్తించొచ్చు.. ట్రై చేయండి!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..