Govt Job Preparation: తెలంగాణలో కొలువుల జాతర.. తక్కువ సమయంలో ఇలా ప్రిపేర్ అవ్వండి..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని విభాగాల్లో మొత్తం 80,039 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని విభాగాల్లో మొత్తం 80,039 ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 9న అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు. దీంతో ఎన్నో రోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్స్ వస్తాయని ఉద్యోగాలకు ప్రిపేర్ అయినవారు కొందరు మాత్రమే. నోటిఫికేషన్స్ వచ్చాయి కదా.. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునేవారు చాలా మందే ఉన్నారు. తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలి.. ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనే సందేహాలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి. తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎలాగో తెలుసుకుందామా.
☛ ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. సోషల్ మీడియాలో గంటలు గంటలు గడిపేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు వివిధ ఎడ్యూకేషన్ సైట్స్ చూసి.. మీకు అవసరమైన విషయాలు తెలుసుకోవడం మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు తక్కువ రేట్లకు స్టడీ మెటిరియల్స్.. ఆన్ లైన్ వీడియో క్లాసులు ఏఏ వెబ్ సైట్స్ అందిస్తున్నాయని.. ఉచితంగా స్టడీ మెటిరియల్స్ లభిస్తాయనేది తెలుకోవాలి.
☛ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఏడాది పరీక్షలు.. అందుకు సంబంధించిన సెలబస్ మారుతుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే.. ఇప్పటివరకు ఉన్న సెలబస్ తోపాటు.. మారిన కొత్త సెలబస్.. అంతకు ముందు ఉన్న సెలబస్ విషయంలో అవగాహన తెచ్చుకోవాలి. నిరంతరం ప్రతి విషయాన్ని తెలుసుకుంటుండాలి. ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్ కు కూడా సిద్ధమయ్యేలా ఉండాలి. ప్రతి చిన్న పుస్తకాన్ని చదువుతూ సబ్జెక్ట్ పై అవగాహన తెచ్చుకోవాలి.
☛ ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా జనరల్ అవేర్ నెస్ ముఖ్యం. అప్టిట్యూట్.. రీజనింగ్ లాంటివి ప్రతిసారి ప్రీపేర్ అవుతూ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించిన మెటీరియల్స్ తీసుకోవాలి.
☛ మన చుట్టు రోజూ జరిగే విషయాలపై అవగాహన ఉండాలి. కరెంట్ ఎఫైర్స్ పై పట్టు సాధించాలి.
☛ ఓవైపు ఎగ్జామ్స్ కోసం ప్రీపేర్ అవుతూనే మరోవైపు వీలైనంతవరకు ఆన్ లైన్ ఎగ్జామ్స్కు అటెండ్ అవుతుండాలి. ఇలా చేయడం వలన టైమ్ మేనేజ్మెంట్ పై అవగాహన వస్తుంది. అలాగే.. మాక్ టెస్టులు రాయడం వలన మీరు ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారు.. ఏ సబ్జెక్టు పై మరింత అవగాహన అవసరం అనే విషయం తెలుస్తుంది. ఆన్ లైన్ పరీక్షలకు హజరు కావడం వలన ముఖ్యంగా మీకు ప్రాక్టీస్ కలుగుతుంది. ఇలా చేయడం వలన మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. మీరు ఏ విషయంలో తప్పులు చేస్తున్నారు అనే విషయాలు తెలుస్తాయి.
☛ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పరీక్షల సమయంలో మీ శరీరంతోపాటు.. మెదడు కూడా చురుగ్గా పనిచేసేలా చూసుకోవాలి. అందుకు మీరు సరైన ఆహారంతోపాటు… మెదడుకు కనీస విశ్రాంతి ఇవ్వాలి. మానసిక ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి.
☛ ప్రస్తుతం మీ అరచేతిలోనే ప్రపంచం తెలుస్తోంది. మీ చేతిలో ఉండే ఫోన్లోనే ప్రపంచంలో జరిగే విషయాలపై అవగహన తెచ్చుకోవచ్చు.
Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..
Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..
Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..