KMC Recruitment: మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.. ఎవరు అర్హులంటే..

KMC Recruitment 2022: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, హన్మకొం/మహాత్మాగాంధీ మెమోరియల్‌ హాస్పిటల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

KMC Recruitment: మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.. ఎవరు అర్హులంటే..
Kmc Recruitment 2022
Follow us

|

Updated on: Mar 31, 2022 | 3:19 PM

KMC Recruitment 2022: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, హన్మకొం/మహాత్మాగాంధీ మెమోరియల్‌ హాస్పిటల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 135 ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (115), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (20) ఖాళీలు ఉన్నాయి.

* జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్తీషియా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ/తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వడంతో పాటు ఎంసీఐ/ఎన్‌ఎంసీ గుర్తింపు కలిగి ఉండాలి.

* అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఏపీ/తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది సూపరిండెంట్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ హాస్పిటల్, ఎంజీ రోడ్, వరంగల్‌–506007 అడ్రస్‌కు పంపించాలి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,25,000, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లకు రూ. 52,000 జీతంగా అందిస్తారు.

* అభ్యర్థులను అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!

New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!

ప్రభుత్వ పాఠశాలలో బాత్రూమ్స్ కడుగుతున్న విద్యార్థులు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు

Latest Articles