Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..!

Job Recruitment: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నాయి. ఆసక్తి, అర్హులైన వారు..

Job Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2021 | 10:02 PM

Job Recruitment: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నాయి. ఆసక్తి, అర్హులైన వారు ఉద్యోగ అవకాశాలు దక్కించుకునే అవకాశం ఆసన్నమైంది. ఇక ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వైద్య కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్తపోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్‌లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్‌లతో పాటు వైద్యకళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం అలాగే. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది. ఇక రాష్ట్రంలో 35 మెడికల్‌ కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులలో 2190 కొత్త పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను చూడవచ్చు. త్వరలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఇవి కూడా చదవండి:

IIT Tirupati Recruitment: తిరుపతి ఐఐటీలో టీచింగ్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

CLAT Exam: లా విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఏటా రెండుసార్లు క్లాట్‌.. కౌన్సెలింగ్‌ ఫీజు కూడా తగ్గింపు..