BOB Recruitment: నిరుద్యోగులకు మంచి అవకాశం.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..

BOB Recruitment 2021: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్‌, బీఈ వంటి..

BOB Recruitment: నిరుద్యోగులకు మంచి అవకాశం.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐటీ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..
Bank Of Baroda
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2021 | 6:59 AM

BOB Recruitment 2021: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్‌, బీఈ వంటి టెక్నికల్ డిగ్రీలు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డేటా సైంటిస్ట్‌, డేటా ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి.

* డేటా సైంటిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. కంప్యూటర్‌ సైన్స్‌, డాటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంఈలలో ఏదో ఒకటి చేసి ఉండాలి.

* డేటా ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీలో ఇంజినీరింగ్‌ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌

* దరఖాస్తు స్వీకరణకు 06-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pregnant Women: గర్భిణులు జాగ్రత్త..! 70 శాతం మంది దీనికి గురవుతున్నారట..?

Health News: గోళ్లు, కళ్లు పసుపు రంగులో ఉన్నాయా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

LB Nagar junction: వాహనదారులూ బీ అలర్ట్.. హైదరాబాద్ ఎల్బీ నగర్ జంక్షన్ నెల రోజుల పాటు మూసివేత.. పూర్తి వివరాలివే..