ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

ECIL Recruitment 2021: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో..

ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Ecil
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2021 | 9:45 AM

ECIL Recruitment 2021: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 09 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-10-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ (వర్చువల్‌) ఇంటర్వ్యూ ధ్వారా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,000 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 19-11-2021న ప్రారంభమవుతుండగా, 26-11-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pushpaka Vimanam : బాలీవుడ్‌కు ఎగిరిపోనున్న “పుష్పక విమానం”.. హీరోగా ఆ క్రేజీ స్టార్ నటించనున్నాడట..!

Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి శెట్టిపై ఫ్యాన్స్ ఆగ్రహం… ‘ఇలా చేస్తావా’ అంటూ కామెంట్స్

Afghanistan Crisis: ఆఫ్గన్ లో ఆకలితో కన్నబిడ్డల అమ్మకం 65 వేల కోసం పిల్లల్ని అమ్మేస్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..