Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి శెట్టిపై ఫ్యాన్స్ ఆగ్రహం… ‘ఇలా చేస్తావా’ అంటూ కామెంట్స్

కృతి శెట్టి... తొలి సినిమా రిలీజ్ అవ్వకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ. ఆమె లుక్‌ చూసే కుర్రకారు ఫిదా అయిపోయారు.

Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి శెట్టిపై ఫ్యాన్స్ ఆగ్రహం... 'ఇలా చేస్తావా' అంటూ కామెంట్స్
Krithi Shetty
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2021 | 8:12 AM

కృతి శెట్టి… తొలి సినిమా రిలీజ్ అవ్వకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ. ఆమె లుక్‌ చూసే కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక  ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మడు చాలామందికి కలల రాకుమారిగా మారిపోయింది. సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ బ్యూటీ డేట్స్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడికి పరిస్థితులకు అలవాటు పడిపోవాల్సిందే.  స్కిన్ షో కానీ, హాట్ రొమాన్స్ సీన్స్, లిప్ లాక్‌లకు ఆమడ దూరం ఉంటానని తొలుత సంకేతాలిచ్చిన ఈ సుందరాంగి.. రెండో సినిమాకే హద్దులు చెరిపేసింది. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా టీజర్‌ చివర్లో.. హీరో నానికి లిప్ లాక్ ఇస్తూ కనిపించింది ఈ బ్యూటీ. టీజర్ ఎండింగ్ వరకు ఎక్కడా కనిపించని కృతి శెట్టి.. చివర్లో మాత్రం నానికి లిప్ లాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కంగుతిన్నారు. మా హార్ట్ బ్రేక్ చేశావ్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కథ డిమాండ్ చేస్తే తప్పదు మరి అనే జస్టిఫికేషన్ ఎలాగూ వస్తుంది కాబట్టి.. అడ్జెస్ట్ అయిపోండి బ్రదర్ అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్.

కృతి శెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు, బంగార్రాజు మూవీలో నాగ చైతన్యతో సరసన నటిస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో మరో సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. కాగా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ. కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఉంది.

Also Read: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం.. అది కూడా గాంధీ ఆస్పత్రిలో ఉండగానే