Pushpaka Vimanam : బాలీవుడ్‌కు ఎగిరిపోనున్న “పుష్పక విమానం”.. హీరోగా ఆ క్రేజీ స్టార్ నటించనున్నాడట..!
కుర్రహీరో ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేశాడు.
Pushpaka Vimanam : కుర్రహీరో ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆతర్వాత మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ తాజాగా పుష్పక విమానం అనే సినిమా చేశాడు. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్పక విమానం సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ అవడానికి రెడీ అయ్యింది. హిందీ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు “పుష్పక విమానం” రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం “పుష్పక విమానం” ను యూనిక్ మూవీగా మార్చాయి. సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది “పుష్పక విమానం”. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. “పుష్పక విమానం” బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కార్తీక్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు పుష్పక విమానం సినిమా లో కూడా అతడే హీరోగా నటించే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ కావడంతో కార్తీక్ కూడా ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :