AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Opportunities for Women: జాబ్‌ మార్కెట్లో మహిళా ఉద్యోగుల హవా.. ఫ్రెషర్స్‌కి ఫుల్‌ డిమాండ్!

ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌లో మహిళలకు ఉద్యోగాలు గణనీయంగా పెరగనున్నాయి. గత ఏడాదితో పోల్చితే 2025 లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగినట్లు ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), మానుఫ్యాక్చరింగ్‌, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాల్లో

Job Opportunities for Women: జాబ్‌ మార్కెట్లో మహిళా ఉద్యోగుల హవా.. ఫ్రెషర్స్‌కి ఫుల్‌ డిమాండ్!
Job Opportunities For Women
Srilakshmi C
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 07, 2025 | 12:35 PM

Share

భారత్‌ జాబ్‌ మార్కెట్ గణనీయమైన పురోగతి కనిపిస్తున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 2025 లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగినట్లు ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), మానుఫ్యాక్చరింగ్‌, హెల్త్‌కేర్ వంటి కీలక పరిశ్రమల్లో ఈ వృద్ధి కనిపిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం వస్తున్న కొత్త టెక్నాలజీలో నిష్ణాతులైన వారికి జాబ్‌ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కూడా ఉంది. ఇవన్నీ మహిళకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు ఫౌండైట్ VP-మార్కెటింగ్ అనుపమ భీమ్రాజ్క అంటున్నారు. ఆఫీస్‌ నుంచి చేసే ఉద్యోగాల్లో 55 శాతం పెరుగుదల గమనించాం. ఇది యజమాని ప్రాధాన్యతలలో మార్పును సూచిస్తుంది. జీతం సమానత్వం, అభివృద్ధి చెందుతున్న పని-మోడ్ ప్రాధాన్యతలు వంటి రంగాలలో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ.. 2025లో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం ప్రోత్సాహకరంగా ఉందని ఆమె అన్నారు.

2025లో మహిళా ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు  కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు ఫౌండిట్ నివేదిక చెబుతుంది. 0 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్న మహిళలకు 53 శాతం ఉద్యోగ అవకాశాలు, 4 నుంచి 6 యేళ్ల అనుభవం ఉన్నవారికి 32 శాతం ఉద్యోగ అవకాశాలు.. ఇలా అనుభవ స్థాయిలు పెరిగేకొద్దీ ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇక 7 నుంచి 10 యేళ్ల అనుభవం ఉన్నవారికి 11 శాతం, 11 నుంచి 15 యేళ్ల అనుభవం ఉన్న వారికి 2 శాతం, 15 కంటే ఎక్కువ యేళ్ల అనుభవం ఉన్నవారికి కేవలం 1% మాత్రమే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఫ్రెషర్స్‌కి ఈ ఏడాది బాగా కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్, మార్కెటింగ్‌లో మొత్తం ఉద్యోగాల్లో మహిళలకు దాదాపు 25 శాతం డిమాండ్‌ ఉంది.

వైట్-కాలర్ వర్క్‌ఫోర్స్‌లో ఐటీలో అత్యధికంగా 23%, ఆ తర్వాత BFSIలో 11%, విద్యలో 6% మహిళలు యజమానులుగా కొనసాగుతున్నారు. రంగాల వారీగా పోల్చి చూస్తే ఐటీ/కంప్యూటర్లు-సాఫ్ట్‌వేర్ రంగాల్లో మహిళలు యజమానులుగా కొనసాగుతున్నప్పటికీ దీని వాటా ఫిబ్రవరి 2024లో 36% ఉంటే ఫిబ్రవరి 2025లో 34%కి స్వల్పంగా తగ్గింది. ఇక మహిళా నియామకాలు, సిబ్బంది ఉద్యోగాల్లో 24% నుంచి 20%కి, BFSI 23% నుంచి 21%కి తగ్గాయి. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్లు, మార్కెట్ రీసెర్చ్‌, పబ్లిక్‌ రిలేషన్స్, ఈవెంట్స్ రంగాల్లో మాత్రం మహిళల భాగస్వామ్యం 8% నుంచి 11%కి పెరిగాయి. అలాగే ఇంజనీరింగ్, ఉత్పత్తి రంగాల్లో కూడా 6% నుంచి 8%కి పెరిగాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం మరొక ముఖ్యమైన ధోరణి. ప్రస్తుతం 26% మంది మహిళలు AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి స్పెషల్ టెక్నాలజీ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే దేశంలో ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (టైర్‌ 1) వెలుపల మహిళా నిపుణుల సంఖ్య పెరుగుతోంది. నివేదిక ప్రకారం.. 2025లో టైర్ 1 నగరాల్లో మహిళలు ఉద్యోగాలలో 41% ఉంటే.. నాసిక్, సూరత్, కోయంబత్తూర్, జైపూర్ వంటి టైర్ 2, టైర్-3 నగరాల్లో 59% ఉన్నారు. ఇది కంపెనీల నియామక వ్యూహాలలో మార్పును సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

టైర్-1 నగరాల్లో 22%తో ఢిల్లీ మహిళల నియామకంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై 15%, బెంగళూరు 15%, హైదరాబాద్ 9% వాటాలు కలిగి ఉన్నాయి. ఈ విషయంతో పూణే వృద్ధిని సాధించింది. దాని ఉద్యోగ వాటా 8% నుంచి 10%కి పెరిగింది. ఇక 2025లో మహిళల జీతాల విషయానికొస్తే.. 81% మహిళలకు 10 లక్షలలోపు, రూ.11 నుంచి 25 లక్షల జీతాలు అందించే ఉద్యోగాలు 11 శాతం, రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతాలు ఇచ్చే ఉద్యోగాలు 8% వరకు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.