JEE Main 2024 Admit Card Download: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి

జేఈఈ మెయిన్‌ సెషన్‌ -1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఇప్పటికే అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేపర్‌-2 పరీక్షకు అడ్మిట్‌ కార్డుల్ని విడుదల చేసింది. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధుల అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ..

JEE Main 2024 Admit Card Download: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి
JEE Main 2024 Admit Card
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 21, 2024 | 4:11 PM

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇప్పటికే అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేపర్‌-2 పరీక్షకు అడ్మిట్‌ కార్డుల్ని విడుదల చేసింది. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధుల అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయడం ద్వారా అడ్మిట్‌కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌ -1కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఇంకా విడుదల కాలేదు. పరీక్ష రోజుకు 3 రోజుల ముందు నుంచి పేపర్ 1 అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. పేపర్‌ 2 పరీక్ష జనవరి 24వ తేదీన సెకండ్‌ షిప్ట్‌లో జరగనుంది. ఫస్ట్‌ షిఫ్ట్‌ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షకు గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉన్నారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధుల కోసం ప్రతీయేట రెండు సార్లు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరానికి రెండోవిడత పరీక్ష వచ్చే ఏప్రిల్‌లో జరుగుతుంది. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న ప్రకటిస్తారు. తెలుగు సహా మొత్తం 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో దాదాపు 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తారు. ప్రవేశాలకు ఇందులో సాధించిన ర్యాంకులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.