JEE Advanced 2025 Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే

2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐఐటీ కన్పూర్ శనివారం పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే..

JEE Advanced 2025 Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే
JEE Advanced 2025 Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2024 | 2:05 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు శనివారం (డిసెంబర్‌ 21) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూర్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏప్రిల్‌ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. మే 18న రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి. జూన్‌ 2న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) సీట్లు భర్తీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరం మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్‌ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్‌ 5 నిర్వహిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ ఇదే..

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: ఏప్రిల్‌ 23, 2025.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మే 2, 2025.
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష తేదీ: మే 18, 2025.
  • పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల ఓఎంఆర్‌ పత్రాలు వెబ్‌సైట్లో విడుదలయ్యే తేదీ: మే 22
  • ప్రాథమిక కీ విడుదల తేదీ: మే 26
  • కీపై అభ్యంతరాల స్వీకరణ: మే 26 నుంచి 27 వరకు
  • తుది కీ, ఫలితాల విడుదల తేదీ: జూన్‌ 2 ఉదయం 10 గంటలకు
  • ఏఏటీ రాసేందుకు రిజిస్ట్రేషన్‌ తేదీలు: జూన్‌ 2, 3
  • ఏఏటీ 2025 పరీక్ష తేదీ: జూన్‌ 5, 2025.
  • ఏఏటీ 2025 పరీక్ష ఫలితాలు: జూన్‌ 8, 2025.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.