AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Sector Jobs: ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌.. ఐటీ సెక్టార్‌లో ఈ జాబ్‌లకు భారీ డిమాండ్‌! తరలివస్తున్న బడా కంపెనీలు

కరోనా టైంలో కుదేలైన ఐటీ సెక్టార్ మళ్లీ పుంజుకుంటుంది. ఈ క్రమంలో 2024-25లో జరగనున్న క్యాంపస్ ప్లేస్ మెంట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీకి చెందిన సాంకేతిక నిపుణుల వేటలో భారీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఐటీ ఉద్యోగాలు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని NLB సర్వీసెస్ తెల్పింది..

IT Sector Jobs: ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్‌.. ఐటీ సెక్టార్‌లో ఈ జాబ్‌లకు భారీ డిమాండ్‌! తరలివస్తున్న బడా కంపెనీలు
IT Sector Jobs
Srilakshmi C
|

Updated on: Dec 10, 2024 | 4:41 PM

Share

వచ్చే ఏడాది (2025)లో వివిధ పరిశ్రమల్లో ఐటీ ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు 15-20 శాతం వృద్ధిని సాధిస్తుందని టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీ పరిశ్రమ H2 2024లో తిరిగి ఊపందుకుందని, 2025లో బహుళ రంగాలలో ఆశాజనకంగా వృద్ధిని సాధించేందుకు సిద్ధమవుతోందని NLB సర్వీసెస్ తెలిపింది. ఉద్యోగావకాశాలు 15 నుంచి 20 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. భారతీయ ఐటీ రంగంలో తాజా నియామకాలు గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ML), డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలతో సహా పలు సాంకేతిక నిపుణులకు డిమాండ్ 30-35 శాతం డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ డిమాండ్ ఉద్యోగ నియామకాలకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యంపై వ్యూహాత్మక దృష్టిని విస్తరించేలా చేస్తుందని తెల్పింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ల్యాండ్‌స్కేప్‌ అవసరాలు తీర్చడానికి తదనుగుణ నైపుణ్యాలతో తమ శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడానికి కంపెనీలు శిక్షణ కార్యక్రమాలలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయని పేర్కొంది.

స్థూల పర్యావరణ వ్యవస్థ, పరిశ్రమ పోకడలు, డిమాండ్ బ్రాండ్‌లపై NLB సర్వీసెస్‌ అనాలసిస్‌ ఆధారపడి ఉంటుంది.2024-25 ద్వితీయార్థంలో పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలపై ఫోకస్‌ పెట్టిందని, నైపుణ్యం కలిగిన యువతకు భారీ వేతనాలు చెల్లించి ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. 2021-22లో ప్రపంచ ఆర్థిక మందగమనం, క్లయింట్లు ఆన్-డిమాండ్ నియామక విధానాలు, గ్లోబల్ స్థూల ఆర్థిక సవాళ్ల కారణంగా.. ఆయా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. అయితే ఇది ప్రాజెక్ట్ పైప్‌లైన్‌పై ప్రభావం చూపింది. అయితే ఇది 2025లో కుదురుకుంటుందని అంచనా. తద్వారా ఫ్రెషర్‌లకు ఉద్యోగావకాశాలు పెరిగే ఛాన్స్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా అనలిటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీలకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ కోర్సులు చేసిన వారికి అదృష్టం తలుపు తడుతుంది. దీంతో 2025లో IT ఫ్రెషర్ నియామకాలు పెరగనున్నాయి. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాలలో కూడా 2025లో తమ ఐటి ఫ్రెషర్ ఇన్‌టేక్‌ను 30 నుంచి 35 శాతం పెంచుతాయని భావిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.