AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Jobs 2025: బీటెక్‌ చేసిన వారికి సూపర్ ఛాన్స్‌! ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

బీఈ, బీటెక్‌ ఇంజనీరింగ్‌ పాసై ఖాళీగా ఉన్న వారికి అదిరిపోయే మీ కోసమే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన కింద భారీగా సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అర్హతలు, నియామక విధానం ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

ISRO Jobs 2025: బీటెక్‌ చేసిన వారికి సూపర్ ఛాన్స్‌! ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
ISRO Jobs
Srilakshmi C
|

Updated on: May 27, 2025 | 2:31 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం ఎందరికో కల. అలాంటి వారికి సువర్ణావకాశం వచ్చింది. తాజాగా ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషర్‌లో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ‘SC’ గ్రూప్‌ ఏ కింద గేజిటెడేడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 320 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 16, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇవే..

  • ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులు: 113
  • మెకానికల్‌ విభాగంలో సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులు: 160
  • కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ పోస్టులు: 44
  • ఎలక్ట్రానిక్స్‌-పీఆర్‌ఎల్‌ విభాగంలో సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ పోస్టులు: 02
  • కంప్యూటర్‌ సైన్స్‌-పీఆర్‌ఎల్‌ విభాగంలో సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ పోస్టులు: 01

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో.. బీఈ, బీటెక్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి కింద జూన్‌ 16, 2025 నాటికి తప్పనిసరిగా 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 27 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.250 చెల్లించాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఇతర వివరాల కోసం నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..