AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే

రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

AP Govt Jobs 2026: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే
APMSRB Hospital Administrator Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 07, 2026 | 5:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన హెల్త్, మెడికల్ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 47 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 17, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు MBBS లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ / హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ (MDS) తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హెల్త్ సెక్టార్‌లో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విభాగంలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో) అడ్మినిస్ట్రేషన్, లీడర్‌షిప్ లేదా మేనేజీరియల్ పాత్రల్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. MS Word, Excel, PowerPoint, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి సాధారణ కంప్యూటర్ అప్లికేషన్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై ప్రావీణ్యం ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన ఉండాలి. మంచి కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, విశ్లేషణాత్మక (Analytical), ఇంటర్‌పర్సనల్ నైపుణ్యాలు ఉండాలి. వయోపరిమితి జులై 1, 2025వ తేదీ నాటికి జనరల్‌ అభ్యర్ధులకు 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి. SC/ ST/ BC/ EWSలకు 47 సంవత్సరాలు, దివ్యాంగులకు 52 సంవత్సరాలు వరకు సడలింపు ఉంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 17, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్ధులు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.80,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల