ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
మెదక్ పట్టణంలో జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మిలిటరీ కాలనీలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధం కారణంగా ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఆగ్రహంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టిన మృతుడి భార్య, అత్తమామ, బావమరిది అనంతరం నేరుగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. పొన్నం కుమార్ (32) అనే వ్యక్తి ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవులపై మెదక్ లోని తన నివాసానికి వచ్చాడు. జూన్ 10వ తేదీన ఆయన తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. అయితే, కుమార్ మిలిటరీ కాలనీలోని తన ఇంట్లో ఇద్దరు మహిళలతో ఏకాంతంగా ఉండగా, ఆయన భార్య ఒక్కసారిగా వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఈ విషయమై ఇంట్లో తీవ్రస్థాయిలో ఘర్షణ రేగింది. కుమార్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య, వెంటనే తన తల్లిదండ్రులు, సోదరుడికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని తీవ్ర ఆవేశంతో కుమార్ పై తీవ్రంగా దాడి చేశారు. దీంతో కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హత్య అనంతరం నిందితులంతా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగు చూసింది. దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తూ, మరికొద్ది రోజుల్లో విధులకు వెళ్లాల్సిన ఆర్మీ జవాన్ ఇలా సొంత ఇంట్లోనే వివాహేతర సంబంధం వల్ల ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సంచలన సృష్టించిన ఈ ఘటనపై మెదక్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..