ISRO: విద్యార్థులకు ఇస్రో గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) విద్యార్థులకు బంపరాఫర్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో కోర్సులు పొందే అవకాశం కల్పించింది. 8వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కోర్సులో భాగంగా రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌తో పాటు గణితం వంటి సబ్జెక్టులను...

ISRO: విద్యార్థులకు ఇస్రో గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Isro Online Course
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2022 | 4:59 PM

భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) విద్యార్థులకు బంపరాఫర్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో కోర్సులు పొందే అవకాశం కల్పించింది. 8వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. కోర్సులో భాగంగా రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌తో పాటు గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఈ కోర్సులో అందించే అంశాలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* అంతరిక్ష్‌ జిగ్నాసా ప్రోగ్రామ్‌లో భాగంగా ఇస్రో ఈ కోర్సులను అందిస్తోంది.

* ఈ కోర్సులో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన రిమోట్‌ సెన్సింగ్ టెక్నాలజీని విద్యార్థులకు బోధిస్తారు.

ఇవి కూడా చదవండి

* తరగతుల్లో అందరికీ అర్థమయ్యేలా విధంగా, ఫొటోలు, యానిమేసన్స్‌తో వివరిస్తారు.

* ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌, జియో స్టేషనరీ, సన్‌ సింక్రసన్‌ శాటిలైట్‌, రిమోట్‌ సెన్సార్స్‌ రకాలు, మల్టీస్పెక్ట్రల్‌ స్కానర్సర్‌, రిమోట్ సెన్సింగ్ వంటి అంశాలను బోధిస్తారు.

* విద్యార్థులకు రిమోట్‌ సెన్సింగ్ టెక్నాలజీ, భూ గ్రహంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ఈ తరగతులును నిర్వహిస్తోంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తొలుత ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

* అనంతరం మీరు చదువుతోన్న పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.

* మీరు ప్రస్తుతం చదువుతోన్న పాఠశాల అనుమతులు తప్పనిసరిగా పొందాలి.

* తరగతుల ప్రారంభానికి సంబంధించిన వివరాలు ఈమెయిల్‌ ద్వారా పంపిస్తారు.

* ఏవైనా సందేహాలు ఉంటే websupport@iirs.gov.in. ఐడీకి మెయిల్‌ చేయొచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..