Govt Jobs: హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
* ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 44,500 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మే 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..