IMU Recruitment: ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.

ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. చెన్నైలో ఉన్న యూనివర్సిటీలోని ఖాళీలను ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IMU Recruitment: ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం పొందే అవకాశం.
Imu Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 15, 2023 | 7:48 PM

ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. చెన్నైలో ఉన్న యూనివర్సిటీలోని ఖాళీలను ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* మెరైన్ ఇంజినీరింగ్, నాటికల్ సైన్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకొని, హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 57,700 నుంచి రూ. 1,82,400 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 04ని చివరి తేదీగా నిర్ణయించారు. హార్డ్‌ కాపీలను మే09లోపు అందించాలి.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..