లక్కీ భాస్కర్ బ్యూటీ కిక్ ఇస్తుందిగా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

27 December 2024

Rajeev 

యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన బబుల్‌గమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మానస చౌదరి. 

మానస చౌదరి తన అందంతో పాటు నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. 

తొలి సినిమా అయినా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ఆకట్టుకుంది ఈ తెలుగమ్మాయి. 

ఈ చిన్నది పుట్టింది చిత్తూరు జిల్లా పుత్తూరు.. చెన్నైలో తాను పెరిగానని మానస చౌదరి గతంలో చెప్పింది. 

రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. కనిపించింది కొంతసేపే కానీ ఆకట్టుకుంది. 

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

తాజాగా మానసచౌదరి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.