Telangana: తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్.. మరికాసేపట్లో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష. ఈ విషయాలు మర్చిపోకండి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఈరోజు (ఆదివారం) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉయదం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు జరగనున్నాయి. 6 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా...
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఈరోజు (ఆదివారం) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉయదం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు జరగనున్నాయి. 6 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో 19,400 సీట్లు ఖాళీగా ఉండగా, 40,137 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7 నుంచి 10 తరగతులకు కూడా భారీగానే దరఖాస్తులు వచ్చాయి.
ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో అధికారులు పరీక్ష నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా మాస్క్‌ను ధరించాలనే నిబంధనను విధించారు. ఇక 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.
అలాగే 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక పరీక్షలు ముగిసన అనంతరం మెరిట్ జాబితాను మే 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు మే 25 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..