Indian Railway Recruitment: ఇండియన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. ఇంటర్, ఐటీఐ అర్హతతో..
ఇండియన్ రైల్వేలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ రైల్వేకు చెందిన పాటియాలా లోకోమోటివ్ వర్క్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.?
ఇండియన్ రైల్వేలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ రైల్వేకు చెందిన పాటియాలా లోకోమోటివ్ వర్క్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏయే విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 295 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రీషియన్, మెకానిక్ (డీజిల్), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్ (జె అండ్ ఈ) ట్రేడుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి, 10+2, ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు అక్టోబర్ 31, 2022 నాటికి వెల్డర్ ఖాళీలకు 15 నుంచి 22 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 16, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..