IMA Recruitment: ఇండియన్ మిలిటరీ అకాడమిలో 188 ఖాళీలు.. ఇంటర్మీడియట్‌తోనే ఉద్యోగం పొందే అవకాశం..
IMA Recruitment 2021: ఇండియన్ మిలిటరీ అకాడమి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో పలు విభాగాల్లో మొత్తం 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?..
IMA Recruitment 2021: ఇండియన్ మిలిటరీ అకాడమి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డెహ్రాడూన్‌లోని ఈ సంస్థలో పలు విభాగాల్లో మొత్తం 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా కుక్, ఎంటీ డ్రైవర్, బుక్ మేకర్/రిపెయిరర్, ఎల్‌డీసీ, మసాల్చి, వెయిటర్, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్(సఫాయివాలా), గ్రౌండ్స్‌మెన్, జీసీ ఆర్డర్లీ, ల్యాబొరేటరీ అటెండెంట్, బార్బర్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యం ఉండాలి. వీటితో పాటు పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ఇండియన్ మిలిటరీ అకాడమి(ఐఎంఏ), డెహ్రాడూన్ చిరునామకు పంపించాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* రాత పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్న పత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 14-01-2022
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: శత్రువుల జలాంతర్గాములను ద్వంసం చేసే INS విశాఖపట్నం.. సామర్ధ్యం.. ప్రత్యేకతల గురించి తెలుసా..