Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..

Indian Bank Recruitment: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండియన్‌ బ్యాంక్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై ప్రధానకేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకులో...

Indian Bank Recruitment: ఇండియన్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..
Indian Bank
Follow us
Narender Vaitla

|

Updated on: May 25, 2022 | 6:20 AM

Indian Bank Recruitment: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండియన్‌ బ్యాంక్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. చెన్నై ప్రధానకేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకులో పలు విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 24-05-2022న మొదలైంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. క్రెడిట్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, ఐటీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజుగా రూ.175, ఇతరులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.

* తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి…

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..