IIT Recruitment: ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్‌లో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఔట్‌సోర్సింగ్ విధానంలో...

IIT Recruitment: ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు... ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Iit Tirupati
Follow us

|

Updated on: May 25, 2022 | 6:15 AM

IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్‌లో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు (సివిల్‌) 02, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు (సివిల్‌, హెచ్‌వీఏసీ/ సర్వీసెస్‌) – 02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ – 01 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 16,000 నుంచి రూ. 35,500 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 31-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..