Indian Bank jobs: నిరుద్యోగులకు అలర్ట్! పదో తరగతి అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 202 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్.. ఇండియన్ బ్యాంక్ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Indian Bank Security Guard Recruitment 2022: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్.. ఇండియన్ బ్యాంక్ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 202
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.14,500ల నుంచి రూ.28,145ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్ ల్యాంగ్వేజ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. 90 నిముషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: