Indian Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు.. ఎవరు అర్హులంటే..
Indian Air Force Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 317 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 సంబంధించి..
Indian Air Force Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 317 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023 సంబంధించి ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 317 పోస్టులకు గాను బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు ఫ్లయింగ్ (77), గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) (129), గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్)–111 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు భర్తీ చేసుకునే ఫ్లయింగ్ బ్రాంచ్ వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
* గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి.
* గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్) పోస్టులకు అప్లై చేసుకునే వారు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థులవ యసు పోస్టులను అనుసరించి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30.12.2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: RRR Movie: రామ్ ట్రైలర్ టీజ్‌ను విడుదల చేసిన భీమ్.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్..
Corona-Omicron: అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. కట్‌చేస్తే ముంబైలో పలకరించిన ఒమిక్రాన్..!