Andhrapradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మెడికల్ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Andhrapradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగంకు చెందిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం..
Andhrapradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగంకు చెందిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం (ఎన్‌టీఈపీ) పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ల్యాబ్ టెక్నీషియన్స్ (04), డీఆర్-టీబీ కౌన్సెలర్లు (01), టీబీ – హెచ్‌వీ (ఎన్‌జీఓ పీపీ) (03), సీనియర్ ట్రీట్‌మెంట్ సూజర్ వైజర్ (01), సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ సూపర్ వైజర్లు (04) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత సర్టిఫికెట్ కోర్సులతో పాటు అని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్, ఓపీ నెం 36, సెంట్రల్ హాస్పిటల్ క్యాంపస్, కర్నూలు అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 13-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Watch Video: డ్రెస్సింగ్ రూంలో గొడవ పడిన పాక్ ప్లేయర్లు.. వైరలవుతోన్న వీడియో..! అసలేం జరిగిందంటే?