Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Season: వచ్చే ఏడాది జరగాల్సిన పెళ్ళిళ్ళు డిసెంబర్ లో కానిచ్చేయాలని తొందర పడుతున్నారు.. ఎందుకంటే..

కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం కుదేలు అయిపోయింది. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో కూడా అర్ధం కాకుండా అయిపొయింది. ప్రత్యేకించి మన దేశంలో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

Marriage Season: వచ్చే ఏడాది జరగాల్సిన పెళ్ళిళ్ళు డిసెంబర్ లో కానిచ్చేయాలని తొందర పడుతున్నారు.. ఎందుకంటే..
Follow us
KVD Varma

|

Updated on: Dec 07, 2021 | 2:10 PM

Marriage Season: కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం కుదేలు అయిపోయింది. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో కూడా అర్ధం కాకుండా అయిపొయింది. ప్రత్యేకించి మన దేశంలో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. దాదాపుగా రెండేళ్ళు.. అన్ని రకాలుగానూ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. ప్రత్యేకించి వివాహాల విషయంలో భారత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మన వివాహ వ్యవస్థలో ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ఎప్పుడంటే అప్పుడు వివాహాలు జరగవు. దానికి పండితులు వేసిన లెక్కల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులు.. తిథులు.. సమయాలు ఉంటాయి. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్లుగా చాలామంది వివాహాలు నిలిచిపోయాయి. ముహూర్తాలు పెట్టుకున్నాకా ఆగిపోయిన పెళ్ళిళ్ళు దేశవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో కరోనా కల్లోలం కాస్త కుదుట పడటంతో రెండు నెలలుగా మెల్లగా వివాహాల ముహూర్తాలు మొదలయ్యాయి. పండితుల లెక్కల ప్రకారం వివాహ శుభాముహూర్తాలు నిర్ణయించుకుని పెళ్లిళ్లకు సిద్ధం అయ్యారు.

నాలుగు నెలలు వరుస వివాహ ముహూర్తాలు..

నవంబర్ నెలలో వివాహాలు ప్రారంభం అయ్యాయి. ఆ నెలలో చాలామంది వివాహాలు చేసుకున్నారు. అయితే, డిసెంబర్ నెలలో ముహూర్హాలు చాలా మంచివిగా పండితులు చెప్పడంతో చాలా మంది తమ వివాహాలను డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్నారు. కానీ, మళ్ళీ మహమ్మారి కొత్త రూపంలో తెలెత్తుతున్న వార్తలతో ఇప్పుడు వివాహాలకు ప్లాన్ చేసుకున్న వారి పరిస్థితి మళ్ళీ అయోమయంలో పడింది. నిజానికి నవంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకూ వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్పారు. డిసెంబర్ నెలలో 2, 7, 8, 9, 11, 12, 13 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్పారు. ఇక అటూ ఇటూగా 16, 18, 20 తేదీలలో కూడా పెళ్లిళ్లకు మంచిది అని వారంటున్నారు. ఇదిలా ఉంటె వచ్చే జనవరిలో 20, 22, 23, 27, 29, 30 తేదీలు, ఫిబ్రవరిలో 04, 05, 06, 07, 10, 18, 19, 20 తేదీలు పెళ్లిళ్లకు మంచిదని పండితులు ముహూర్తాలు నిశ్చయించారు.

ఈ తేదీల్లో పెళ్ళిళ్ళ కోసం చాలామంది వధూవరులు సిద్ధం అయ్యారు. అయితే, ఇప్పుడు సీన్ మారిపోతోంది. ఒమిక్రాన్ వణుకు మొదలైంది. జనవరి, ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు చేసుకోవలనుకున్న జంటలు చాలా మంది డిసెంబర్ లోనే పెళ్ళికి రెడీ అయిపోతున్నారు. ఈ నెలలో అందుబాటులో ఉన్న ముహూర్తాలలో పెళ్లి చేసేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. దీంతో 9, 11, 12, 13 తేదీల్లో వివాహాలకు ఊపు వచ్చేసింది. ఇప్పటికే ప్లాన్ చేసుకున్న వారు కాకుండా కొత్తగా తమ వివాహ ముహూర్తాలను ముందుకు జరుపుకున్న వారితో కళ్యాణ మండపాలు.. కేటరింగ్ .. ఈవెంట్ ఆర్గనైజర్లకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది.

ఆ భయంతోనే..

దీనికి కారణం ఒక్కటే.. గత రెండేళ్ళలోనూ ఇదేవిధంగా ముహూర్తాలు మొదలైన తరువాత కరోనా రక్కసి తన కోరలు చాపడంతో చాలా పెళ్ళిళ్ళు నిలిచిపోయాయి. కొన్ని పెళ్ళిళ్ళు షరతుల మధ్య తూ తూ మంత్రంగా జరిపించేశారు. ఈసారి కూడా అలాగే అవుతుందేమో.. డిసెంబర్ తరువాత పరిస్థితి కఠినంగా మారిపోతుందేమో అనే భయంతో పెళ్ళిళ్ళు ముందుకు జరుపుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఆ అవకాశం లేని వారు తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అనె బెంగలో పడ్డారు. డిసెంబర్ 20 తరువాత మళ్ళీ జనవరి 20 వరకూ ముహూర్తాలు లేకపోవడమూ ఇక కారణం అదేవిధంగా జనవరిలో 20 నుంచి 30 మధ్య కేవలం ఆరు ముహూర్తాలు మాత్రమె ఉండడమూ మరో కారణం. మొత్తమ్మీద ఒమిక్రాన్ ప్రజల్లో మళ్ళీ లాక్ డౌన్ భయాల్ని రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి: Facebook Profile: ఫేస్‌బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? ఇలా చేయండి.. చాలు!

Detox Juice: ఆరోగ్యానికి మంచిదని డిటాక్స్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జ్యూస్ వలన ఫలితం ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..