AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona-Omicron: అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. కట్‌చేస్తే ముంబైలో పలకరించిన ఒమిక్రాన్..!

Corona-Omicron: అమెరికాకు చెందిన అమ్మాయి.. ఆప్రికన్ ఫ్రెండ్ అయిన యువకుడిని కలవడానికి ముంబై రాగా.. వారిద్దరూ ఇప్పుడు ఒమిక్రాన్ బారిన పడ్డారు. స్నేహితుడికి కలవడానికి వచ్చి..

Corona-Omicron: అమెరికా అమ్మాయి.. ఆఫ్రికా అబ్బాయి.. కట్‌చేస్తే ముంబైలో పలకరించిన ఒమిక్రాన్..!
Omicron
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2021 | 1:57 PM

Share

Corona-Omicron: అమెరికాకు చెందిన అమ్మాయి.. ఆప్రికన్ ఫ్రెండ్ అయిన యువకుడిని కలవడానికి ముంబై రాగా.. వారిద్దరూ ఇప్పుడు ఒమిక్రాన్ బారిన పడ్డారు. స్నేహితుడికి కలవడానికి వచ్చి.. ఒమిక్రాన్ బారిన పడటం ఇప్పుడు ప్రధానంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన యువకుడు నవంబర్ 25న ముంబైకి వచ్చాడు. అదే రోజున.. అతన్ని కలిసేందుకై అమెరికాకు చెందిన యువతి సైతం ముంబైకి వచ్చింది. అయితే, తాజాగా వీరిద్దిరికీ కరోనా టెస్ట్‌ చేసి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ రెండు కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 10కి చేరింది. అయితే, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చెందిన వ్యక్తి(37) తొలుత ముంబైకి రాగా.. అమెరికాకు చెందిన అతని గర్ల్‌ఫ్రెండ్ సైతం ముంబైకి వచ్చింది. వీరిద్దరూ కలిసి ఉన్నారు. వీరిలో తొలుత దక్షిణాఫ్రికా వ్యక్తికి కరోనా సోకగా.. ఆ తరువాత మహిళకు కూడా సోకింది. ఇందులో విశేషమేంటంటే.. ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదు. వీరిద్దరనీ అధికారులు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, వీరిద్దరూ ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్నారు.

ఇదిలాఉంటే.. విదేశాల నుంచి ముఖ్యంగా హై రిస్క్ దేశాల నుంచి వచ్చే వ్యక్తుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి ట్రేస్, ట్రాక్, టెస్ట్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఇద్దరు వ్యక్తులు కలిసిన వారిని ట్రేస్ చేశారు అధికారులు. ఈ ఇద్దరు వ్యక్తులు తమకు పరిచయం ఉన్న ఐదుగురిని కలవగా.. ఆ ఐదుగురు వ్యక్తుల ద్వారా 315 కనెక్ట్ అయ్యారు. వీరందరిని అధికారులు ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఇకపోతే పూణె, పింప్రీ చించ్వాడ్ లలో ఏకకాలంలో ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు వారు కాగా, మిగతా వారి వయస్సు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే ఉండటం కలవరానికి గురి చేస్తోంది.

ఒమిక్రాన్ రిలీఫ్.. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారతదేశంలోనూ అంతే స్థాయిలో విస్తరిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఇక్కడ రిలీఫ్ కలిగించే విషయం ఏంటంటే.. ఒమిక్రాన్ వైరస్ వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు కూడా పెద్దగా లేవని చెబుతున్నారు. చాలా మంది వ్యాక్సీన్ తీసుకోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకా తీసుకున్న వారిపై పెద్దగా ప్రభావం చూపబోదని, ప్రాణాంతకంగా పరిణమించదని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Also read:

Vehicle Checking: వాహన తనిఖీలో పట్టుబడ్డ బైక్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్ చలాన్లు.. బండి వదిలి పరారైన వాహన దారుడు..!

Children Protest: మాకు న్యాయం కావాలి.. రోడ్డెక్కిన చిన్నారులు.. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..!

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు.. పోలీసుల రియాక్షన్ మామూలుగా లేదుగా..!