AP,TS India Post GDS Results 2023: ఏపీ, తెలంగాణ పోస్టాఫీస్ జీడీఎస్ 2023 సెకండ్ మెరిట్ లిస్టు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2,480, తెలంగాణలో 1,266 వరకు ఖాళీలు..
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2,480, తెలంగాణలో 1,266 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి రెండో జాబితాను పోస్టల్ శాఖ బుధవారం (ఏప్రిల్ 12) విడుదల చేసింది. అర్హులైన వారి వివరాలను కింది లింక్‌లలో చెక్ చేసుకోవచ్చు.
పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా సమాచారం అభ్యర్ధులకు అందజేస్తారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ ఉద్యోగాల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 21వ తేదీలోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ దశలో కూడా అర్హత సాధించిన వారికి మాత్రమే నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఫలితాల-2023 కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.