TS 10th class Result date 2023: రేపట్నుంచి తెలంగాణ ‘పదో తరగతి’ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 544 పరీక్ష కేంద్రాల్లో ప్రతి రోజూ 1.59 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 544 పరీక్ష కేంద్రాల్లో ప్రతి రోజూ 1.59 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో తెలుగు, హిందీ ల్యాంగ్వేజ్ పరీక్షల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేంత వరకూ డీఈవోలు నిర్విరామంగా విధులు నిర్వహించారు. ఇక పది జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను ఏప్రిల్ 13 నుంచి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయ్యేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నెల రోజుల్లోపు ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మే 10 తర్వాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.