Income Tax Recruitment: ఇన్‌కమ్ ట్యాక్స్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు.?
Income Tax Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ముంబయిలోని ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఈ ఖాళీలను భర్తీ...
Income Tax Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ముంబయిలోని ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 155 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ (08), ట్యాక్స్ అసిస్టెంట్ (83), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) – (64) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. * ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్ణీత వేగంతో టైపింగ్ చేయగలగాలి. అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. * మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. మెట్రిక్యూలేషన్/తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, స్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారం బోర్డ్, బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డి, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్, వాలీబాల్ వంటి క్రీడాంశాల్లో రాష్ట్ర/ దేశ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ ప్రదర్శన చేసి ఉండాలి. * ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొని ఉండాలి. * షార్ట్ లిస్టింగ్ అయితన అభ్యర్థులకు.. గ్రౌండ్/ ప్రొఫిషియన్సీ టెస్ట్, టాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులని స్కిల్ టెస్ట్ (టైపింగ్) ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా 25-08-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telangana Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్తీ
Ananthapuramu District: బుజ్జి చిరుత గజగజలాడించింది, పరుగులు పెట్టించింది.. చివరకు