Ananthapuramu District: బుజ్జి చిరుత గజగజలాడించింది, పరుగులు పెట్టించింది.. చివరకు

 నిండా 45రోజులు వయసు కూడా లేని ఒక చిరుతపులి పిల్ల గ్రామస్థులను పరుగులు తీయించింది. కాకపోతే ఇక్కడ పులి పిల్లను చూసి గ్రామస్థులు, గ్రామస్థులను  చూసి పులి పిల్ల...

Ananthapuramu District: బుజ్జి చిరుత గజగజలాడించింది, పరుగులు పెట్టించింది.. చివరకు
Cheetah Cub
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2021 | 5:44 PM

నిండా 45రోజులు వయసు కూడా లేని ఒక చిరుతపులి పిల్ల గ్రామస్థులను పరుగులు తీయించింది. కాకపోతే ఇక్కడ పులి పిల్లను చూసి గ్రామస్థులు, గ్రామస్థులను  చూసి పులి పిల్ల హడలిపోవడం గమనించదగ్గ విషయం. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో చిరుతపులి పిల్ల కనిపించిన సంఘటన అందర్నీ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రామ్మోహన్ అనే వ్యక్తి తోటలోకి కొందరు రైతు కూలీలు వెళ్తుండగా..  ఒక చిరుతపులి పిల్ల తారసపడింది. దీంతో ‘అమ్మో చిరుత’ అంటూ వారు అక్కడ్నుంచి పరుగులు తీశారు. వారిని చూసి భయంతో చిరుతపులి పిల్ల కూడా లగెత్తింది. వెంటనే రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది చిరుతపులి పిల్లను చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే  బోన్ లో బంధించారు. అనంతరం దానిని తిరుపతిలోని జూకి తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే 45 రోజుల వయసు ఉన్న ఈ పిల్లను తల్లి పులి వదిలేసి వెళ్లడంతో.. అది దిక్కుతోచక తాగునీటి కోసం గ్రామంలోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న చిరుతల సంచారం

చిరుతల సంచారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమలలో ఒక్కరోజు రెండు చోట్ల చిరుతలు గుబులు రేపగా, మెదక్‌ జిల్లాలోని గ్రామాల్లో చిరుత భయంతో జనం బెంబేలెత్తుతున్నారు. తిరుమలలో నిన్న ఒక్కరోజు రెండు సార్లు చిరుతలు ప్రత్యక్షమై భక్తుల్ని భయాందోళనలకు గురిచేశాయి. రెండో ఘాట్‌లో రోడ్డు దాటుతూ చిరుత కనిపించగా, అటుగా వెళ్తున్న వారు చిరుతను సెల్‌ఫోన్‌లో బంధించారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డులో చిరుత సంచారంతో… భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఇక నిన్న రాత్రి సన్నిధానం దగ్గర రెండోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సిబ్బంది, భక్తులు పరుగులు తీశారు. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌ దగ్గర కొద్దిరోజులుగా చిరుత సంచారం చేస్తుండడం కలకలం రేపుతోంది.

మరోవైపు మెదక్‌ జిల్లాలోని శంకరంపేట, చేగుంట, నార్సింగ్‌ మండలాల్లో చిరుత కలకలం సృష్టిస్తోంది. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన ఈ కాలంలో ప్రజలు గుంపులుగా వెళ్లి రావడం తప్ప.. వేరే మార్గం కనిపించడంలేదు. అర్జంటుగా అటవీ శాఖ అధికారులు చిరుతల కోసం ట్రాప్‌లు ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు.

Also Read: క్రికెట్ ఆడిన సీఎం జగన్.. క్లాసీ షాట్స్‌‌తో కరేజ్ చూపించారు.. క్లాప్స్ కొట్టించారు

నెల్లూరులో దారుణం.. 17 రోజుల పసికందును నీటి ట్యాంక్‌లో పడేసి చంపేశారు…