IIM Faculty Jobs: నెలకు రూ.2,20,200ల జీతంతో ఐఐఎమ్ బోథ్‌గయాలో టీచింగ్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక
బోథ్‌గయాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 45 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
బోథ్‌గయాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 45 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కెటింగ్, ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ అండ్ అనలిటిక్స్ హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టులకు 10 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 6 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి. ఆసక్తికలిగిన అభ్యర్ధులు మార్చి 21, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,700ల నుంచి రూ.2,20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.